కడప జిల్లా రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపారు. దేశ, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆ సంఘం నాయకుడు గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయుడు ఆరోపించారు. కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు లేక వీధిన పడ్డ భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు చేయూతనిస్తున్న ప్రభుత్వం... కార్మికుల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ వాటి నుంచి ఒక్క పైసా కూడా కార్మికులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులోని నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున అందించాలని డిమాండ్ చేశారు.
రాజంపేటలో భవన నిర్మాణ కార్మికులు నిరసన - building workers peotest in rajampeta latest news
భవన నిర్మాణ రంగ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కడప జిల్లా రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆ సంఘ నాయకుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులు నిరసన