ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుగ్గవంక రిజర్వాయర్ ఏరియల్ సర్వే - బుగ్గవంక రిజర్వాయర్ ఏరియల్ సర్వే

కడప జిల్లాలోని బుగ్గవంక డ్యాంకు ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల సమయంలో నీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళుతున్నందున.. సమస్య ఎక్కడుందో గుర్తించడానికి సర్వే చేపట్టామని డీఎస్పీ సునీల్ తెలిపారు. సమస్యను గుర్తించి, నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులను పంపిస్తామని చెప్పారు.

buggavanka reservoir
బుగ్గవంక రిజర్వాయర్ ఏరియల్ సర్వే

By

Published : Dec 10, 2020, 12:30 PM IST

కడప జిల్లా బుగ్గవంక డ్యాం, కాలువను డీఎస్పీ సునీల్, సిస్టం ఏపీ ఇంఛార్జ్ మొయిన్ ఖాన్ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేశారు. నివర్ తుపాను ప్రభావంతో బుగ్గవంక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని డీఎస్పీ తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఏరియల్ సర్వే నిర్వహించామని చెప్పారు.

మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బుగ్గవంక ప్రొటక్షన్ వాల్ నిర్మించారని డీఎస్పీ అన్నారు. అయితే వాల్​కు అక్కడక్కడా ఖాళీలు ఉన్నందున వరదల సమయంలో నీరంతా లోతట్టు ప్రాంతాల్లోకి వస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏరియల్ సర్వే చేశామని చెప్పారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి, నివేదిక తయారుచేసి పై అధికారులకు పంపిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details