రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని... అన్ని జిల్లాలకూ దాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని బుగ్గన చెప్పారు. కడప కలెక్టరేట్‌లో మంత్రులు బుగ్గన, పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాథరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
'రాయలసీమలో హైకోర్టు... ప్రభుత్వం పరిశీలన' - Buggana Rajendranath reddy
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కడప జిల్లాలో యురేనియం కాలుష్యం వల్ల కలిగే అనర్థాలను పరిష్కరించడానికి ప్రతి నెలా యూసీఐఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండీ... అక్టోబర్ 4 నుంచి వైఎస్ఆర్ వాహన మిత్ర