వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో 5 గంటల పాటు విచారణ జరిగింది. వివేకా హత్య గురించి తనను సిట్ అధికారుల ప్రశ్నించారని... వారు అడిగినవాటికి తెలిసిన సమాధానాలు చెప్పానని రవి వివరించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపారు. వివేకాపై పోటీ చేసి గెలిచినందున... పులివెందుల రాజకీయ పరిస్థితులపై తనకు అవగాహన ఉందని... కేసు విచారణకు తాను ఇచ్చే సమాచారం ఉపయోగపడుతుందని సిట్ అధికారులు భావించారన్నారు.
వివేకా కేసులో అసలు దోషులను పట్టుకోండి: బీటెక్ రవి - వివేకా హత్యకేసులో సిట్ విచారణకు హాజరైన బీటెక్ రవి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో... సిట్ అధికారులు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. వివేకా కేసులో అసలు దోషులను పట్టుకోవాలని... రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
![వివేకా కేసులో అసలు దోషులను పట్టుకోండి: బీటెక్ రవి btech ravi attends sit enquiry on viveka murder case at kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5278855-997-5278855-1575545701113.jpg)
వివేకా హత్యకేసులో సిట్ విచారణకు హాజరైన బీటెక్ రవి
వివేకా హత్యకేసులో సిట్ విచారణకు హాజరైన బీటెక్ రవి
ఇదీ చదవండి: వివేకా హత్య కేసులో సిట్ ముందుకు బీటెక్ రవి