తమ పట్ల అధికార వైకాపా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీటెక్ రవి కుమారుడు రామ్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే తన తండ్రిని అరెస్టు చేశారని, తమ అనుచరులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు కడపలోని సింహాద్రిపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
'తమ అనుచరులు, కార్యకర్తల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' - కడప జిల్లా వార్తలు
తన తండ్రి బీటెక్ రవిని వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేయించిందని రామ్‌రెడ్డి ఆక్షేపించారు. అధికార పార్టీ నాయకులు... తమ అనుచరులు, కార్యకర్తల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
తమ అనుచరులు, కార్యకర్తల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
అధికార పార్టీ నాయకులు.. తమ అనుచరులు, కార్యకర్తలు జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వైకాపా నేతలకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తన తండ్రి నిరంతరం పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అలాంటి వ్యక్తిని ఓ అంతర్జాతీయ నేరస్తున్ని అరెస్టు చేసినట్లు చెన్నై విమానాశ్రయంలో తన తండ్రిని అదుపులోకి తీసుకోవడం ఏంటని రామ్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చూడండి:'వైకాపాలో బెంజ్, పేకాట మంత్రులు తయారయ్యారు'