కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం కస్తూరిరాజుగారిపల్లె దళితవాడలో పాతకక్షలు భగ్గుమన్నాయి. గత ఏడాది ఇదే గ్రామంలో జరిగిన ధర్మయ్య హత్య కేసులోని ప్రధాన నిందితుడు ఓబులేసు(40) ఆదివారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
కడప జిల్లాలో దారుణహత్య... పాతకక్షలే కారణమా..! - kadapa crime news
కడప జిల్లా కస్తూరిరాజుగారిపల్లెలో దారుణ హత్య జరిగింది. గతేడాదిలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఓబులేసు ఇటీవల కండిషన్ బెయిల్పై బయటకు వచ్చాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన చిన్న పుల్లయ్యను లక్కిరెడ్డిపల్లెకు వెళ్లి వద్దామని తోడుగా పిలిచాడు. భార్య అడ్డుచెప్పడంతో పుల్లయ్య రాలేనని చెప్పాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య కుమారుడు రమేశ్.. గతేడాది మా బంధువును చంపావు.. ఇప్పుడు మళ్లీ మా నాన్నను బయటకు రమ్మని ఎందుకు పిలిచావంటూ ఓబులేసుతో వివాదానికి దిగాడు. ఓబులేసుతో ఎప్పటికైనా తమ కుటుంబానికి ప్రమాదం ఉందని భావించిన రమేశ్, గతేడాది హత్యకు గురైన ధర్మయ్య సోదరుడు, కొంతమంది కలిసి ఓబులేసును కత్తులతో నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి