కడప జిల్లాలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుఝాము నుంచి కురుస్తున్న వర్షాలతో గండి సమీపంలో రాయచోటి రోడ్డులో శేషాచలం కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మార్గంలో రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. అధికారులు స్పందించని కారణంగా... యువకులు, పాఠశాల విద్యార్ధులే వాటిని తొలగించేందుకు ముందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. కొండరాళ్లు విరిగి పడే సమయానికి ఆ ప్రాంతంలో వాహనాలు లేని కారణంగా.. ప్రమాదం తప్పింది.
కడప జిల్లాలో విరిగిపడ్డ కొండ చరియలు - gandi
కడప జిల్లా చక్రాయపేటలో తెల్లవారుఝామున కురిసిన భారీ వర్షానికి గానూ గండి - రాయచోటి రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.
కడప జిల్లాలో విరిగిపడ్డ కొండ చరియలు