YSR District People Suffering: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పెన్నా నదిపై ప్రధాన వంతెన కుంగి ఏడాది దాటినా మరమ్మతులు పూర్తికాలేదు. పెండింగ్ పనులు పూర్తవడానికి ఇంకో నెలైనా పడుతుందని అధికారులు చెప్తున్నారు. నదిపై తాత్కాలికంగా.. ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు తరచూ తెగిపోవడంతో 16 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షాలకు ఇప్పటికే తాత్కాలిక వంతెన నాలుగు సార్లు తెగింది. ఈనెల 18న మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీరు వదిలారు. అప్రోచ్ రోడ్డు కోసం ఏర్పాటు చేసిన పైపులు కొట్టుకుపోకుండా అధికారులు రెండు చోట్ల గండి కొట్టారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ప్రయాణికులు, విద్యార్థులు గులకరాళ్ల మధ్యే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
సీఎం సొంత జిల్లాలో.. ఏడాది దాటినా పూర్తికాని వంతెన మరమ్మతులు - వైఎస్సార్ జిల్లా
YSR District People Suffering: సీఎం సొంత జిల్లాలో వంతెన లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. పెన్నా నదిపై ప్రధాన వంతెన కుంగి ఏడాది దాటినా మరమ్మతులు పూర్తికాలేదు. తాత్కాలిక వంతెన తరచూ కొట్టుకుపోవడంతో ప్రజలు నదిలోనే నడక సాగిస్తున్నారు. దీంతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వంతెన లేక ప్రజలు కష్టాలు
"వంతెన మరమ్మతులు పూర్తికాకపోవడం వలన చూట్టూ తిరిగి రావాలంటే రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతోంది. సుమారు 25 కిలోమీటర్ల దూరం పోయి రావాలి. ఇప్పటికే తాత్కాలిక వంతెన నాలుగు సార్లు తెగిపోయింది. వీలైనంత త్వరగా వంతెన పూర్తి చేయాలని కోరుతున్నాం". - స్థానికులు
ఇవీ చదవండి: