కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకి వెళ్లే దారిలో పెన్నా నదిపై వంతెన ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు శివారులో 67వ జాతీయ రహదారిపై ఈ వంతెన ప్రారంభించిన 12 ఏళ్లకే పలుచోట్ల కడ్డీలు తేలాయి. రక్షణ గోడ రెండుచోట్ల ధ్వంసమైంది. వంతెనపై 13 స్తంభాలు ఉండగా 31 జాయింట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటి మధ్యం రబ్బరు ధ్వంసం కావడం వల్ల ప్రమాదకరంగా మారిందని... ప్రయాణం కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.
పలుచోట్ల గుంతలు పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాయాణికులు పేర్కొన్నారు. లైటింగ్ వ్యవస్థ లేనందున రాత్రివేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందారు. లైటింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.