కడప జిల్లా సిద్ధవటం వద్ద పెన్నా నదిపై నిర్మించిన వంతెన పగుళ్లు వచ్చి ఇనుప కడ్డీలు బయటపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు.ఈ వంతెనపై నుంచి కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడు,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.వాహనాలు వెళ్లే సమయంలో వాటి ధాటికి వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపిస్తోంది.ప్రస్తుతం పెన్నా వరద నీరు పొంగి పొర్లుతున్న సమయంలో ఈ వంతెనపై ప్రయాణం చేసేందుకు వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు.ఎంతో ప్రాధాన్యత కలిగిన వంతెనను అధికారులు పట్టించుకోకపోవటంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.ప్రమాదం జరిగితే తప్ప అధికారులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సార్..! పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించండి - bridge damaged in kadapa
పెన్నా నదిపై సిద్దవటం వద్ద నిర్మించిన పురాతన వంతన,ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. పెన్నా నది వరదలతో వంతెన పగుళ్లు వచ్చింది. ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయంలో వంతెన ఊగుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పగుళ్లిచ్చినా పట్టించుకోరా?
TAGGED:
bridge damaged in kadapa