కడప జిల్లాలోనే ప్రధానమైన సిద్దవటం సమీపంలోని పెన్నానదిపై నిర్మించిన వంతెన తీవ్రంగా దెబ్బతింది. అడుగడుగునా గోతులు పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వంతెన ప్రారంభించిన కొన్ని నెలలకే దెబ్బతినడంతో అప్పట్లో అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. అనంతరం వంతెన మీదుగా పెద్దసంఖ్యలో వాహనాల రాకపోకలతో కొంతకాలానికే అతుకుల వద్దనున్న రబ్బర్లు తొలగిపోయి పెద్ద పెద్ద గోతులేర్పడ్డాయి. దీంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతుండడమే కాకుండా మరమ్మతులకు గురవుతున్నాయి. వంతెన దెబ్బతినడంతో మరమ్మతులకు రూ.కోటితో ప్రతిపాదనలు పంపించామని రహదారులు, భవనాలశాఖ ఏఈ అన్వర్‌బాషా అన్నారు. నిధులు మంజూరైన వెంటనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని వివరించారు.
పెన్నా సేతువు... ప్రమాద హేతువు! - సిద్దవటం వంతెన వార్తలు
కడప జిల్లాలో సిద్దవటం వద్ద పెన్నానదిపై వంతెన గోతులమయమైంది. నిర్మాణానికి రూ.12 కోట్లు ఖర్చవగా..దీని ప్రారంభం 2009 లో చేశారు. అక్కడన వంతెన దెబ్బతినడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సిద్దవటం వంతెన
ఇదీ చూడండి.