కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాతవరణం ఉక్కపోతగా ఉన్నా.. రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నేడు స్వామివారు సజీవ సమాధి పొందిన రోజు అయిన కారణంగా... భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు. ఈ కారమంతో పెద్ద సంఖ్యలో సమాధి దర్శనానికి బారులు తీరారు. తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మంగారి మాలధారణతో వచ్చిన భక్తులు ఇరుముడిని సమర్పించారు.
బ్రహ్మంగారి మఠానికి పోటెత్తిన భక్తులు - devotees
కాలజ్ఞాన రూపకర్త పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు బ్రహ్మంగారి మఠంలో వైభవంగా జరుగుతున్నాయి.

బ్రహ్మంగారి మఠం