కడప నగరంలో బాలుడు అదృశ్యమవ్వటం స్థానికంగా కలకలం రేపింది. అక్కాయపల్లిలో నివాసముండే లక్ష్మీ దేవి... తన కుమారుడు సంతోష్(9)ను ఆదివారం ఇంటి వద్ద ఉంచి... పని నిమిత్తం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూడగా సంతోష్ కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినప్పటికి ఆచూకీ దొరకలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబసభ్యులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడపలో తొమ్మిదేళ్ల బాలుడు అదృశ్యం - కడప నేర వార్తలు
కడప తాలూకా పరిధిలోని అక్కాయపల్లికి చెందిన తొమ్మిది సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాలుడు అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు