ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో ఈ నెల 4న జరిగింది. నిందితుడు ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి అరుస్తూ తలుపుతట్టగా నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. పరారైన వ్యక్తిని రాజంపేట, మన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ - బాలికపై అత్యచారం చేసిన యువకుడు అరెస్ట్
రాజంపేట మండలం తాళ్లపాకలో ఈ నెల 4న బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
![బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ boy arrested for committing rape on girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5985700-153-5985700-1581025894447.jpg)
బాలికపై అత్యచారం చేసిన యువకుడు అరెస్ట్
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
Last Updated : Feb 7, 2020, 9:13 AM IST