ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త మరణం తట్టుకోలేక.. గంటల వ్యవధిలో భార్య కన్నుమూత... - కడప జిల్లాలో భార్యభర్తలు ఇద్దరు మృతి వార్తలు

మూడుముళ్లు, ఏడడుగులతో ఏర్పడిన ఆ బంధం కాటికి చేరే వరకూ అలాగే సాగింది. అనారోగ్యంతో భర్త మృతి చెందిన గంటల వ్యవధిలో భార్య కూడా కన్నుమూసింది. ఈ విషాద ఘటన కడప జిల్లా కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లి గ్రామంలో జరిగింది.

bond between husband and wife that never dies
భార్యభర్తల అన్యోన్య బంధం.. ఒకేసారి ముగిసిన జీవిత ప్రయాణం

By

Published : Feb 22, 2021, 12:15 PM IST

కడప జిల్లా కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లిలో అసిన్ భాష, భార్య నన్నెమ దంపతులు జీవిస్తున్నారు. అసిన్ భాష వృద్ధాప్యంలో అనారోగ్య కారణంగా మృతి చెందాడు. కుమారుడు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అసిన్ భాష భార్య నన్నెమ కూడా కన్నుమూసింది. ఒకేరోజు తల్లితండ్రి మృతి చెందడంతో తనయుడు ఖంగుతిన్నాడు. భార్యభర్తలిద్దరు ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details