కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్ ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా కొవిడ్ పాజిటివ్ కేసులను బయటికి చెప్పకుండా దాచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి భౌతిక దూరాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం దుకాణాలు తెరవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
'కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం' - కడప జిల్లా వార్తలు
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ కేసులను బయటకు చెప్పకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు.
ఆందోళన చేస్తున్న బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు