బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు ముఖ్యమంత్రి జగన్‌పై ధ్వజమెత్తారు. కడప జిల్లా రాయచోటిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. రాజధాని తరలించే పరిస్థితి వస్తే రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సోనియా గాంధీ అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు గుర్తించకుండా, తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో చరిత్రహీనులుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు.
'అమరావతి తరలిస్తే రాజధానిని సీమలోనే ఏర్పాటు చేయాలి' - సీఎంపై నాగోతు రమేష్ నాయుడు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చరిత్రహీనులుగా నిలిచిపోతారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు.
అమరావతి తరలిస్తే రాజధాని సీమలోనే ఏర్పాటు చేయాలి