భారత రాజ్యాంగం ప్రకారమే... నేడు పాలన కొనసాగుతోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. మాతృభాషను విస్మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రాలు మాతృభాష కోసం పోరాటాలు చేస్తుంటే... ఏపీ ప్రభుత్వం ఆంగ్లం పట్ల వ్యామోహం కలిగి ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. మాతృభాష కోసం పోరాటాలు చేస్తామని... ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేస్తామని ఉద్ఘాటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 లక్షల ఉద్యోగాలు తొలగించిందని ఎద్దేవా చేశారు. మాతృభాషను కాదనే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.
'మాతృభాషను విస్మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే' - mlc madhav latest updates
కడపలో భాజపా శాసనమండలి సభ్యులు పీ.వీ.ఎస్ మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై ఆయన వ్యాఖ్యానించారు. మాతృభాషను మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు.
'మాతృభాషను ఉల్లంఘిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే'