కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. గోపవరం పంచాయతీ పరిధిలో ఇచ్చిన 1400 కుళాయి కనెక్షన్ల కోసం వసూలు చేసిన డిపాజిట్ మొతాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయక పోవడం వల్ల కుళాయి కనెక్షన్ తీసుకున్న వారికి పంచాయతీ నోటీసులు జారీ చేస్తోందన్నారు. గత పాలకమండలి దాదాపు 90 లక్షల ప్రభుత్వ నిధులను దారి మళ్లించి వ్యక్తిగత ఖాతాల్లోకి జమచేసుకున్నారని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని భాజపా నాయకులు హెచ్చరించారు.
కడప జిల్లాలో భాజపా నాయకుల ఆందోళన - kadapa bjp
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. గోపవరం పంచాయతీ పరిధిలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి...సమగ్ర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కడప జిల్లాలో భాజపా నాయకుల ఆందోళన
Last Updated : Oct 28, 2019, 8:34 AM IST