కడప జిల్లాలో జరిగిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాజపా మద్దతు తెలిపిన అభ్యర్థులు ఘన విజయం సాధించినట్లు.. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. భాజపా మద్దతుతో గెలిచిన 28 సర్పంచ్ అభ్యర్థులు, 221 వార్డు సభ్యులను ఆయన మీడియాకు పరిచయం చేశారు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాజపా మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓడించేందుకు అధికార పార్టీ నాయకులు అన్ని రకాలుగా ప్రయత్నం చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.
'అధికార ధన దాహాన్ని తట్టుకొని భాజపా విజయకేతనం ఎగురవేసింది' - భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తాజా వార్తలు
నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాజపా మద్దతుదారులు 28 మంది సర్పంచ్ అభ్యర్ధులుగా విజయం సాధించటంపై.. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను మీడియాకు పరిచయం చేశారు.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి
అధికార, ధన దాహాన్ని తట్టుకొని జమ్మలమడుగు నియోజకవర్గంలో 28 మంది సర్పంచులు గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని విజయాలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...