ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఏఏ ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే రాజీనామా చేస్తా' - భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ప్రెస్​మీట్​ న్యూస్

సీఏఏ, ఎన్​ఆర్సీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. చట్టాలకు వ్యతిరేకంగా కడపలో ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ నిర్వహించడం సరైంది కాదని అన్నారు.

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ప్రెస్​మీట్​
భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ప్రెస్​మీట్​

By

Published : Jan 25, 2020, 3:23 PM IST

Updated : Jan 25, 2020, 7:18 PM IST

సీఏఏపై అవగాహన కల్పించేందుకు సిద్ధమన్న భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ అన్నారు. కడప పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కేవలం దురుద్దేశంతోనే ఈ చట్టాలపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేందుకు తాము ఎక్కడికైనా వస్తామని.. నిరూపిస్తే రాజీనామా చేస్తామని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. చట్టాలకు వ్యతిరేకంగా కడపలో ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ నిర్వహించడం సరైంది కాదన్నారు. అవసరమైతే ఈ లాంగ్ మార్చ్​లో తాము పాల్గొని చట్టాల గురించి ఎలాంటి నష్టం లేదని ముస్లింలకు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Last Updated : Jan 25, 2020, 7:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details