కడపలో జరుగుతున్న భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ మేరకు చేపట్టిన బైక్, ట్రాక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని హరిత హోటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు కూడళ్లలను కలుపుకుంటూ సాగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందన్న ఆయన రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేస్తామని తెలిపారు.
'రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేస్తాం' - bjp state president somu veerraju at kadapa dist news
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా జెండా ఎగురుతుందని సోము వీర్రాజు అన్నారు. కడపలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆయన భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ర్యాలీ ప్రారంభిస్తున్న సోము వీర్రాజు
ఇవీ చూడండి...