ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు.. కేంద్రం చెక్ పెట్టడం ఖాయం: సోము - somu verraju election campaign news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్​కు ప్రత్యర్థి భాజపాయేనని అన్నారు.

somu veerraju
సోము వీర్రాజు

By

Published : Mar 6, 2021, 12:40 PM IST

ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధ్వజం

వైకాపా నేతలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. వైకాపాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ... దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడపలో పర్యటించిన ఆయన... కమలం గుర్తుకే ఓటేయలంటూ ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో జగన్‌కు ప్రత్యర్థి భాజపాయేనని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీసులు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని వీర్రాజు ఆరోపించారు.. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి... ప్రజా మద్ధతు లేకనే ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అప్రజాస్వామ్య వ్యవహారాలకు నరేంద్రమోదీ నాయకత్వం.. చెక్ పెడుతుందని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details