BJP state president Daggupati Purandeshwari: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా.. అభివృద్ధి చేయడంలో రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, గండికోటలో 20 టీఎంసీల నీరు నిలువ చేస్తున్నా..రైతులకు సాగునీరు అందించలేదని పురందేశ్వరి ఆక్షేపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇల్లు మంజూరు చేపట్టిందని, అనేక జాతీయ రహదారులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధిని మూలకు పడేసిందని, కేవలం స్వలాభం కోసమే ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సర్పంచులు ఉపయోగించుకోకుండా రాష్ట్రమే వాడుకోవడం దుర్మార్గమన్నారు.
BJP Purandheswari 'సీమ రైతులు, యువతను మోసం చేసిన ప్రభుత్వమిది! పొత్తులు ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు! '
BJP state president Daggupati Purandeshwari: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు ఏ ఒక్క పరిశ్రమను కూడా ప్రారంభించకుండా, ఉపాధి అవకాశాలను కల్పించకుండా యువతను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా.. అభివృద్ధి చేయడంలో రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా తాగు, సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైదని పురందేశ్వరి పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరి రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి ప్రారంభించారు. వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమావేశానికి హాజరైన పురందేశ్వరి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. కడప విమానాశ్రయంలో ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలకగా.. ప్రొద్దుటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయల్ కౌంటీలో నిర్వహించిన సీమ జోనల్ స్థాయి సమావేశానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. భారీ బైక్ ర్యాలీ కొత్తపల్లి కూడలి నుంచి.. శివాలయం కూడలి, బొల్లవరం మీదుగా బైక్ ర్యాలీ రాయల్ కౌంటీకి చేరుకుంది. తమ తండ్రి ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచారం కూడా రాయలసీమ నుంచే ప్రారంభించారని ఇప్పుడు తాను కూడా రాష్ట్ర పర్యటన సీమ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
ఏపీలో పొత్తుల విషయం ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని, తాము రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. రాయలసీమ దత్త పుత్రుడిగా, రాయలసీమ బిడ్డగా తమ తండ్రి ఎన్టీఆర్ ప్రకటించుకున్నాడని, అదే నేల మీద తాను బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏ విధమైన సహకారం ఇవ్వాలో ఆ సహకారాన్ని మాత్రమే అందిస్తుంది తప్ప బీజేపీ, వైసీపీ మధ్య ఎలాంటి రాజకీయ బంధాలులేవన్నారు. వైసీపీ కి సహకరిస్తూ ఉంటే రాష్ట్రంలో ఎందుకు పోరాటం చేస్తామని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్ణయం మేరకే జరుగుతోందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రం స్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి, సాగు నీటి విషయంలో కర్నూలు రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోమారు స్పష్టం చేశారు. రాయలసీమ ఉద్యమ నాయకుడు బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా 'ఆయన వద్ద ఏమైనా సమాచారం ఉంటే నేరుగా నడ్డా వద్దకు వెళ్లవచ్చు' అని బదులిచ్చారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ లో ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన కుమార్తె శబరి బీజేపీలో ఉన్నారని పురందేశ్వరి తెలిపారు.