ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు చట్టాలపై అవగాహన లేదు' - భాజపా అధికార ప్రతినిథి బండి ప్రభాకర్ వార్తలు

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు చట్టాలపై అవగాహన లేదని.. ఆయన ముస్లిం సోదరులను మోసం చేస్తున్నారని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్​ఆర్సీ, సీఏఏ చట్టాలను రద్దు చేయడాన్ని ఆక్షేపించారు.

bjp state president bandi prabhakar about nrc caa npr laws in kadapa
బండి ప్రభాకర్, భాజపా అధికార ప్రతినిథి

By

Published : Jun 18, 2020, 3:43 PM IST

రాష్ట్రంలో ఎన్​పీఆర్, ఎన్​ఆర్సీ, సీఏఏ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శాసనసభలో ప్రకటించడం దారుణమని.. భాజపా అధికార ప్రతినిథి బండి ప్రభాకర్ అన్నారు. ఒకసారి అమలైన చట్టాలను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. కడపలో మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి అంజాదా బాషాకు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు.

ఆయన ముస్లిం సోదరులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత 20 ఏళ్లలో కడపలో ముస్లింలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని.. అయితే వారిలో ఏ ఒక్కరూ తమ వర్గం అభివృద్ధికి కృషి చేయడం లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details