మాజీ మంత్రి, కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డి.ఎల్.రవీంద్రారెడ్డిని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని డీఎల్ నివాసంలో భేటీ అయ్యారు. వైకాపా పాలనతోపాటు మంత్రుల తీరుపై డీఎల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భాజపా నాయకుడి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్.. మాజీ మంత్రిని కలిశారు. తాజాగా బద్వేలు ఉప ఎన్నిక కోసం జిల్లాకు వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి.. డీఎల్‌ను కలవడం చర్చనీయాంశమైంది.
మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డితో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ - BJP state general secretary Vishnuvardhan Reddy
భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.. మాజీ మంత్రి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డి.ఎల్.రవీంద్రారెడ్డిని కలిశారు. బద్వేలు ఉప ఎన్నిక సందర్బంగా డీఎల్‌ను కలుసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డితో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ