BJP Vishnu Vardhan Reddy: రాష్ట్రంలో భాజపా, జనసేన పార్టీలు విడిపోవాలని చాలా పార్టీలు కోరుకుంటున్నాయని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అదే జరిగితే అధికార వైకాపా లాభపడుతుందనే విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు. 2024లో భాజపా, జనసేన కలిసే పోటీ చేస్తాయని.. అధికార పార్టీని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు. అవినీతి సొమ్ముతో 175 స్థానాలు గెలుస్తానని మైండ్ గేమ్ ఆడుతున్న సీఎం జగన్ ఉచ్చులో పడొద్దని విపక్షాలకు సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా ధీటుగా పోరాడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన గాలికొదిలేసిన సంగతి అటుంచితే.. సొంతజిల్లాలో కూడా ప్రజలను పట్టించుకోలేదని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
భాజపా, జనసేన విడిపోవాలని చాలా పార్టీలు కోరుకుంటున్నాయి: విష్ణువర్ధన్ రెడ్డి - వైకాపా
BJP Vishnuvardhan Reddy: జనసేన, భాజపా పొత్తుపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు విడిపోవాలని చాలా పార్టీలు చూస్తున్నాయని ఆయన అన్నారు. అదే జరిగితే అధికార పార్టీ లాభపడుతుందన్నారు.
Etv Bharat