ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కడపలో కరోనా కేసులకు ఆ మంత్రే కారణం' - corona in kadapa

మైనార్టీ శాఖ మంత్రిగా షేక్ అంజాద్ బాషా విఫలమయ్యారని భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. మంత్రి చేస్తున్న పనుల వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి సమస్యలు చుట్టుకుంటాయని చెప్పారు.

bjp spokesman Bundy Prabhakar comments on deputy cm amjadh basha
ఉపముఖ్యమంత్రి షేక్ అంజాద్ బాషాపై అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ విమర్శలు

By

Published : Apr 6, 2020, 12:40 PM IST

మీడియాతో మాట్లాడుతున్న భాజపా నేత బండి ప్రభాకర్

మైనారిటీ మంత్రిగా ఉంటూ రాష్ట్రం నుంచి దిల్లీ ప్రార్థనకు ఎంతమంది వెళ్లారన్న వివరాలు లేకపోవడం సిగ్గుచేటని భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి షేక్ అంజాద్ బాషా తీరును తప్పుబట్టారు. ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వస్తే.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా విజృంభిస్తుంటే కడప నగరానికి కేవలం రూ. 7 లక్షలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందడానికి ఉప ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details