రాష్ట్రంలో అధికార పార్టీ.. దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతోందని రాజ్యసభ సభ్యులు రమేష్‌నాయుడు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇంతటి దరిద్రమైన పాలన ఎన్నడూ చూడలేదన్నారు. ఎన్నికల కమిషనర్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. కడపలో మున్సిపల్ ఎన్నికలపై అభ్యర్థులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
'వైకాపా దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతోంది' - Adhi narayana reddy latest news
పశ్చిమ్‌బంగలో భాజపా ప్రభుత్వం రాబోతుందని... అదే తరహాలో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ.. దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పశ్చిమ్‌బంగ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం రాబోతోందని.. అదే తరహాలో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. తెదేపాపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీతో అధికారులు అందరూ భయపడుతున్నారని చెప్పారు. గత్యంతరం లేక అధికారులు.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
ఇదీ చదవండి