ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాయచోటి ప్రభుత్వ కళాశాల మైదానాన్ని కాపాడాలి' - bjp protest at rayachoti in kadapa district

కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని కాపాడాలని భాజపా నాయకులు కలెక్టర్​ను కోరారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాల మైదానాన్ని ఇతురులకు కేటాయిస్తే ఊరుకునేది లేదని అన్నారు.

bjp protest at rayachoti in kadapa district
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భాజాపా నాయకులు

By

Published : Dec 21, 2019, 5:49 PM IST

రాయచోటి ప్రభుత్వ కళాశాల మైదానాన్ని కాపాడాలని భాజపా విజ్ఞప్తి

కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని కాపాడాలని భాజపా నాయకులు జిల్లా కలెక్టర్ హరికిరణ్​ను కోరారు. ప్రభుత్వం.. కళాశాల మైదానాన్ని ఇతరులకు కేటాయిస్తే ఊరుకునేది లేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతా రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల కళాశాల మైదానాన్ని విద్యా సంస్థకే ఉంచాలని...ఇతరులకు కేటాయించడానికి ప్రభుత్వ భూమి చాలా ఉందని ఆమె తెలిపారు. కళాశాల మైదానం కోసం రేపటి నుంచి నిరాహార దీక్షలు చేస్తామని.. రాయచోటి ప్రజలంతా తమ వెంట ఉండాలని కోరారు. భవిష్యత్ తరాలకు అన్యాయం జరిగితే భాజపా పోరాడుతుందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details