బద్వేలు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఈ ఉపఎన్నికకు కేంద్ర బలగాలను కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కోరినట్లు...దానికి వారు సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. తిరుపతి ఉపఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్నారన్న ఆయన.. వైకాపా కావాలనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బద్వేలు ఉపఎన్నికకు ఇంఛార్జిగా నియమించారని ఆరోపించారు.
BADVEL BYPOLL: స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేదు: భాజపా నేత సత్యకుమార్ - kadapa district latest news
బద్వేలు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఈ ఉపఎన్నికకు కేంద్ర బలగాలను కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కోరినట్లు...దానికి వారు సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
సత్యకుమార్
సీఎం సొంత నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేశారన్న ఆయన...బద్వేలు వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ఉపఎన్నిక వస్తుందనే ఉద్దేశ్యంతో సీఎం..బద్వేలు ప్రజలకు వరాల జల్లు కురిపించారని విమర్శించారు. సంక్షేమ పథకాలపై వైకాపా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: