భాజాపా ఎంపీ సీఎం రమేష్ నాయుడు కడప జిల్లాలోని తన స్వగ్రామంలో 1200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్డౌన్ అమలు కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇంటింటికి తిరిగి ఆయన సరుకులను అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు ఎంపీ ఎంపీ లాడ్స్ నుంచి 4.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రల సహాయనిధికి రూ.కోటి చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. కడప జిల్లాకు రూ.60 లక్షలు అందించినట్లు పేర్కొన్నారు. మరో రూ.2 కోట్లను పీఎం సహాయనిధికి ఇచ్చినట్లు వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రాణాలను లెక్క చెయ్యకుండా వైద్యులు, పోలీసులు, పాత్రికేయులు తమ విధులు నిర్వహిస్తున్నారని ఎంపీ ప్రశంసించారు.
సరుకులు పంపిణీ చేసిన భాజపా ఎంపీ - mp cm ramesh naidu donation for cm relief fund news
భాజాపా ఎంపీ సీఎం రమేష్ నాయుడు కడప జిల్లాలోని తన స్వగ్రామంలో 1200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన భాజపా ఎంపీ