'ఆలయ ఆస్తులపై పెత్తనం వద్దు' - జమ్మలమడుగులో ఆలయ ఆస్తుల పరిరక్షణకోసం దీక్షలు
ప్రభుత్వం దేవాలయాలపై పెత్తనం చెలాయించటం సరికదాని బీజేవైఎం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లెల శ్రవణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుమేరకు ఉపవాస దీక్షలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.
!['ఆలయ ఆస్తులపై పెత్తనం వద్దు' bjp leaders strike at kadapa dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7351217-1040-7351217-1590488449171.jpg)
రాష్ట్ర ప్రభుత్వం హిందువుల దేవాలయాలపై పెత్తనం చెలాయించటం దారుణమని బీజైవైఎం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లెల శ్రవణ్ కుమార్ ఆరోపించారు. తాత్కాలికం కాకుండా శాశ్వత పరిష్కారంగా జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు. కడప జిల్లా జమ్మలమడుగులో స్థానిక భాజపా కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు దీక్షకు కూర్చున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుమేరకు ఉపవాస దీక్షలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. తితిదే ఆదాయాన్ని పక్కదారి పట్టించేందుకే వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.