ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్లస్థలాల పేరిట పేదలను మోసం చేస్తున్నారు' - కడప జిల్లా భాజపా వార్తలు

వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు పేరిట ప్రజలను మోసం చేస్తోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. కడప జిల్లాలో పేదలకు కేటాయించిన భూములన్నీ కొండల్లో గుట్టల్లోనే ఉన్నాయని...ఇలాంటి స్థలాల్లో ఎలా నివసిస్తారని మండిపడ్డారు.

bjp leaders fired on ycp govt sanctioned lands to poor people
bjp leaders fired on ycp govt sanctioned lands to poor people

By

Published : Jul 1, 2020, 3:29 PM IST

వైకాపా ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వటం అంతా మోసమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలకు అనువైన ప్రాంతంలో కాకుండా కొండలు గుట్టల్లో స్థలాలు ఇవ్వటం దారుణమన్నారు. కడప శివారులో పేదలకు ఇస్తున్న భూములను భాజపా జిల్లా రాష్ట్ర నాయకులు పరిశీలించారు. కనీసం సెంటు కూడా లేకుంటే నివాసాన్ని ఎలా నిర్మించికుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేవలం అధికార పార్టీకి, అధికారులకు డబ్బులు సంపాదించి పెట్టే పథకాన్ని ప్రవేశ పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్థలాలను రద్దు చేసి జనావాసంలో స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఇదీ చూడండిప్రధానవార్తలు@3PM

ABOUT THE AUTHOR

...view details