నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావటంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాల బాటపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో రాజకీయ పార్టీల నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మూడో వార్డులో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ఇంటింటి తిరిగి తమ పార్టీ అభ్యర్ధి తరుపున ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థిని గంగాభవాని గెలిపించాలని ఓటర్లను కోరారు. అయితే భాజపా అభ్యర్థికి మద్దతుగా ఇక్కడ ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించటం విశేషంగా మారింది.
ఇలాంటి ఏకగ్రీవాలు చెల్లవని ఉత్తర్వులు ఇవ్వాలి..