నిర్మాణ రంగంలో సిమెంట్ కంటే ఇసుక ఖర్చు పెరిగిందని.. భాజపా నేత ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా మైదుకూరులో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇసుక సత్యాగ్రహం'లో ఆయన పాల్గొన్నారు. వైకాపా నాయకులకు ఇసుక ఆహారంగా మారిందన్నారు. ఎన్నడూలేని విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలే ఇసుక కబ్జా చేస్తున్నారని... జీఎస్టీ పోయి జేఎస్టీ వచ్చిందని మండిపడ్డారు. జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్లగా.. జేఎస్టీ వైకాపా నాయకుల జేబుల్లోకి వెళుతోందంటూ ఆరోపించారు. సీఎం జగన్ అన్ని రంగాల్లో అవినీతిని చొప్పించారని ధ్వజమెత్తారు.
'వైకాపా నాయకులకు ఇసుక ఆహారంగా మారింది' - మైదుకూరులో భాజపా నేతల ధర్నా వార్తలు
వైకాపా నాయకులకు ఇసుక ఆహారంగా మారిందని.., ఎన్నడూలేని విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుకను దోచుకుంటున్నారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. సీఎం జగన్ అవినీతి పాలన చేస్తున్నారని ఆరోపించారు.
భాజపా నేతల ధర్నా