BJP Leader TG Venkatesh Sensational Comments: రాయలసీమ గర్జనకు హాజరుకాని వారు ఆ ప్రాంత దోషులుగా మిగిలిపోతారంటూ మంత్రి బుగ్గన సినిమా డైలాగ్స్ చెప్పడం సరికాదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు బీజేపీ డిక్లరేషన్‌లో ఉందని.. మనసావాచా కర్మనా ఆ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసింది ఎవరని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నుంచి లేఖ రాసినా ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నారు.
'చందమామ రావే జాబిల్లి రావే' అన్నట్లుగా ప్రభుత్వ ప్రకటనలు: టీజీ వెంకటేష్ - చందమామ రావే జాబిల్లి రావే
BJP Leader TG Venkatesh: గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెడుతుందని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమ గర్జనకు హాజరుకాని వారు ఆ ప్రాంత దోషులుగా మిగిలిపోతారంటూ మంత్రి బుగ్గన సినిమా డైలాగ్స్ చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది? ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలకు బదులే లేదన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది.. ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది? ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలకు బదులే లేదు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం లేదని.. బుండేల్, సిద్దేశ్వరం, సరస్వతి, అన్నమయ్య హంద్రీనీవా ప్రాజెక్టులు గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు చందమామ రావే జాబిల్లి రావే అన్నట్లుగా ఉంటున్నాయి. గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెడుతుంది. -టీజీ వెంకటేష్, ఎంపీ
ఇవీ చదవండి: