కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ఉపఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన అంశాలపై కడపలో జిల్లా స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు.
కుటుంబ వారసత్వాలను ప్రోత్సహించదు
జగన్ పార్టీకి.. భాజపా కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదనని సోము వీర్రాజు అన్నారు. బద్వేలు సమీపంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది గానీ.. జగన్, చంద్రబాబు ఎక్కడైనా రోడ్లు వేశారా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలను భాజపా ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణిస్తే.. ఆయన భార్య పోటీ చేసినంత మాత్రానా తప్పుకోవాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. తమ మిత్రపక్షం జనసేన పోటీనుంచి తప్పుకోవడంతో పార్టీ పరంగా ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నామన్న రాష్ట్ర అధ్యక్షుడు.. ఏమైనా ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు.