VEERRAJU FIRES ON MP VIJAYASAI : విశాఖలో ప్రధాని పర్యటనకు సంబంధించి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. వైయస్సార్ జిల్లా పులివెందులలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని పర్యటన కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదేనని.. ఎలాంటి రాజకీయ పర్యటన కాదని విజయసాయిరెడ్డి పేర్కొనడం మంచి పరిణామం కాదన్నారు. ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది అయితే ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు విశాఖలో సమీక్ష నిర్వహించి పర్యటన వివరాలు వెల్లడిస్తున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా.. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు: సోము వీర్రాజు - ప్రధాని పర్యటన వివరాలు
Somu Fires On MP Vijaya Sai : ప్రధాని పర్యటనకు సంబంధించి వైకాపా ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది అయితే ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు విశాఖలో సమీక్ష నిర్వహించి పర్యటన వివరాలు వెల్లడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారిక పర్యటన అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరాలు వెల్లడించాల్సి ఉండగా.. విజయసాయిరెడ్డి అంతా తానే వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా విజయసాయి మాట్లాడడం మంచిది కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వాలంటీర్లను ఉపయోగిస్తుందని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందన్న సోము వీర్రాజు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని గతంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: