ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా నేత బాల్​రెడ్డి మృతి... ఉపరాష్ట్రపతి సంతాపం - AP BJP News

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన భాజపా సీనియర్ నేత నరాల బాల్​రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. నరాల బాల్​రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు.

భాజపా నేత బాల్​రెడ్డి మృతి
భాజపా నేత బాల్​రెడ్డి మృతి

By

Published : May 25, 2021, 9:16 PM IST

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ నరాల బాల్​రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు.

ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా... ఆప్యాయంగా ఇంటికి పిలిపించి ఆదరించేవారని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. గత లాక్​డౌన్ సమయంలో తనతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాల్​రెడ్డికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నామని, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 15,284 కరోనా కేసులు, 106 మరణాలు

ABOUT THE AUTHOR

...view details