ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదు.. కేసు త్వరగా తేలాలి' - వివేకా హత్యకేసుపై ఆదినారాయణరెడ్డి కామెంట్స్

మాజీమంత్రి వివేకా హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు. హత్య కేసును తనకు అంటగట్టడం దారుణమన్నారు.

'వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదు.. కేసు త్వరగా తేలాలి'
'వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదు.. కేసు త్వరగా తేలాలి'

By

Published : Apr 8, 2021, 10:52 PM IST

వివేకా హత్య కేసు సంబంధించి వైయస్ విజయమ్మ విడుదల చేసిన లేఖ గందరగోళంగా ఉందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసును తనకు అంటగట్టడం దారుణమన్నారు. ఈ కేసు త్వరగా తేలాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. షర్మిలమ్మ , వైయస్ జగన్ ఇద్దరూ ఒకటేనాని చెబుతున్నారని.. అలాంటప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

షర్మిలమ్మ కొత్త పార్టీ పెడితే ఇద్దరూ ఒక్కటే ఎలా అవుతారని అన్నారు. ఎంపీటీసీ , జడ్పిటిసీ ఎన్నికల్లో తనను రాజకీయంగా దెబ్బతీయాలని సొంత గ్రామమైన దేవగుడిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పాకిస్తాన్ సరిహద్దును తలపించేలా చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details