BJP Leader Adinarayana Reddy Fire on YS Family: వైయస్ వివేకా హత్య వెనుక జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారని.. భాజపా నేత ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిన వారందరినీ సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. తమపై ఆరోపణలు చేస్తూ ఇన్నాళ్లూ కేసును పక్కదారి పట్టించిన వారికి.. సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టుగా అభివర్ణించారు.
వివేకా హత్య వెనుక.. జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారు: ఆదినారాయణ రెడ్డి - వివేకా హత్య కేసు వివరాలు
BJP Leader Adinarayana Reddy Fire on YS Family: వైయస్ వివేకా హత్య కేసును.. తెలంగాణకు బదిలీ చేయటంపై భాజపా నేత ఆదినారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వివేకా హత్య వెనుక జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపించారు. గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిన వారందరినీ సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.

"ఒక్కటే ప్రశ్న.. గుండెపోటా గొడ్డలి పోటా... గొడ్డలి పోటైతే గుండె పోటుగా ఎలా మారుతుంది.. సుప్రీంకోర్టు కూడా చాలా జాగ్రత్తగా, ధర్మంగా, న్యాయంగా తీర్పునిచ్చింది.. ఇప్పుడు చాలా మంది ప్రజానీకం ఆలోచన ఏమిటి అంటే.. తెలంగాణ రాష్ట్రంలోనైనా న్యాయం జరుగుతుందా..కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు ఒక్కటే కదా.. మరి న్యాయం ఎలా జరుగుతుందని అడిగితే వారందరికీ ఒక్కటే చెప్పినా.. ఈ సమస్య తీవ్రమైనది..అందులోనూ సీబీఐ చేతిలో కేసు ఉంది కాబట్టి.. అందరినీ విచారించాలి, కొత్తగా ఎఫ్ఐఆర్ తయారుచేయాలి, విజయసాయి రెడ్డి, జగన్, జగన్ సతీమణి భారతి, అవినాశ్ రెడ్డి, వైయస్ కుటుంబం మొత్తాన్ని విచారించాలి" ఆదినారాయణ రెడ్డి, భాజపా నాయకుడు
ఇవీ చదవండి: