రాష్ట్రంలో రాజరిక పాలన జరుగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్‌పై పలు విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేశ్ చట్ట ప్రకారం నడుచుకోవటం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదని విమర్శించారు. జగన్ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మీడియా సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. హైకోర్టు తీర్పుపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలి తప్ప విలేకర్ల ముందుకు రావడం ఏంటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు చట్టబద్దత లేదని చెప్పారు.
'రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతోంది' - భాజపా నేత ఆదినారాయణ రెడ్డి వార్తలు
జగన్ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చట్ట ప్రకారం నడుచుకోవటం ముఖ్యమంత్రికి ఏ మాత్రం ఇష్టం లేదని విమర్శించారు.
!['రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతోంది' aadi narayana reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7427829-549-7427829-1591007129985.jpg)
aadi narayana reddy