ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీకో న్యాయం మాకో న్యాయం తగునా' - bjp leader aadinarayana reddy

జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి సవాల్​కు భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రతి సవాల్​ విసిరారు.

'మీకో న్యాయం మాకో న్యాయం తగునా'

By

Published : Oct 30, 2019, 6:33 AM IST

జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి సవాల్​కు భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రతి సవాల్​ విసిరారు. తాను పార్టీ మారిన విషయం వాస్తవమేనని... కానీ సుధీర్​ రెడ్డి కుటుంబ సభ్యులు మూడు పార్టీలు మారారు కదా? అంటూ ఆరోపించారు. మీకో న్యాయం మాకో న్యాయం తగునా అంటూ ప్రశ్నించారు. 2011లో జగన్​ తరఫున నిలబడి రాజకీయంగా ఎంతో సహాయ సహకారాలు తనకు అందించినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో తెదేపా తరఫున మైసూరా రెడ్డి పోటీ చేస్తే మీరు మద్దతుగా ఉన్నారు కదా అంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో తగినంత ఇసుక ఉండగా సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందని వాపోయారు.

'మీకో న్యాయం మాకో న్యాయం తగునా'

ABOUT THE AUTHOR

...view details