ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జలాశయాల్లో నీరు నింపండి.. నిర్వాసితుల కళ్లల్లో కన్నీరు కాదు' - భాజపా నేత ఆదినారాయణ రెడ్డి వార్తలు

ప్రభుత్వం జలాశయాల్లో నీరు నింపాలే కానీ.. నిర్వాసితుల కళ్లల్లో కన్నీరు కాదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ సూచించారు. గండికోట నిర్వాసితులు 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు.

bjp leader aadinarayana reddy about gandikota Expatriates
ఆదినారాయణరెడ్డి, భాజపా నేత

By

Published : Sep 25, 2020, 2:54 PM IST

సుమారు 70 ఏళ్లుగా పరిష్కారం కానీ వ్యవసాయ బిల్లులకు సంబంధించి సమస్యను ప్రధాని మోదీ వెంటనే పరిష్కరించారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి అన్నారు. పండిట్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితులు 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. జలాశయాల్లో నీళ్లను నింపాలి కానీ నిర్వాసితుల కళ్ళల్లో కన్నీరు కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details