ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు' - BJP leaders comments on agricultural laws

దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. భారత్ బంద్ పిలుపును విరమించుకోవాలని వివిధ పార్టీలను, రైతులను కోరారు.

Shashi Bhushan Reddy comments
రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు

By

Published : Dec 7, 2020, 7:56 PM IST

రైతుల మేలు కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా స్థానిక భాజపా నేతలతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరెేకంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు నిరసనలకు దిగటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటును ఈ చట్టాలు కల్పిస్తున్నాయని వివరించారు. రైతులు అర్థం చేసుకోవాలన్న ఆయన, రేపటి భారత్ బంద్​ పిలుపును విరమించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details