కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలు, అక్రమాలకు అంతే లేకుండా పోతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బద్వేలు పట్టణంలో పేదల భూములను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని రకాలుగా దౌర్జన్యాలు చేయడానికి సిద్ధమైందని ఆరోపించారు. బద్వేలులో అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం ఆమడదూరంలో పెట్టిందని విమర్శించారు.
BUDVEL BYPOLL: 'మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వండి' - బద్వేలు ఉపఎన్నిక
బద్వేలు పట్టణంలో పేదల భూములను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ప్రాంతంలో అధికార వైకాపా చేస్తున్న ఆగడాలు అక్రమాలకు అంతేలేకుండా పోతుందని అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో భాజపా జనసేన కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
BJP AP state president
బద్వేల్ మున్సిపాలిటీలో భాజపా జనసేన కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సోము వీర్రాజుతోపాటు జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ పార్టీ నేతలు కలిసి ఇంటికి తిరుగుతూ భాజపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వమని ఓటర్లను సోము వీర్రాజు అభ్యర్థించారు.
ఇదీ చదవండి:TDP Fire On YCP:సవాంగ్ డీజీపీ కాదు.. 'డీజేపీ'.. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది: తెదేపా