గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజాపా అభ్యర్థులు విజయం సాధించటం పట్ల భాజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దుబ్బాక శాసనసభ ఉపఎన్నికల్లోనూ భాజపా అభ్యర్థి గెలిచి సత్తా చాటారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గెలవకూడదని మన సీఎం జగన్...తెరాసకు మద్దతు తెలిపారని విమర్శించారు. తెలంగాణలో భాజపా గెలిస్తే... ఏపీలోనూ భాజపా బలపడుతుందని సీఎం భయపడుతున్నారన్నారు. అభివృద్ధి విషయంలో వైకాపా దారుణంగా వైఫల్యం చెందిందన్నారు. వారి అసమర్థతకు నిరసనగా...శనివారం కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
'తెలంగాణలో భాజపా గెలిస్తే...ఏపీ సీఎం భయపడుతున్నారు' - జగన్పై ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో భాజపా గెలిస్తే... ఏపీలోనూ భాజపా బలపడుతుందని సీఎం జగన్ భయపడుతున్నారన్నారని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యనించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజాపా అభ్యర్థులు విజయం సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో భాజపా గెలిస్తే...ఏపీ సీఎం భయపడుతున్నారు