కడప జిల్లాలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో ఉద్రిక్తత నెలకొంది. పీఠాధిపతి ఎంపిక విషయంలో నెలకొన్న వివాద నేపథ్యంలో.... బ్రహ్మంగారి మఠంలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీకాంత్ నిర్వహించిన మీడియా సమావేశాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. పీఠాధిపత్యం సమస్య కొలిక్కి వచ్చిన తర్వాత... మళ్లీ వివాదం సృష్టించేందుకు విశ్వబ్రాహ్మణులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల పాటు మఠాధిపతులు ఇక్కడ పర్యటించి... దివంగత పీఠాధిపతి పెద్దభార్య కుమారుడు వెంకటాద్రిస్వామికి అర్హత ఉందని తేల్చారని... కానీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్.... దివంగత పీఠాధిపతి రెండో భార్యకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మఠాధిపతి రెండోభార్యకు అనుకూలంగా తాము వ్యవహరించడంలేదని... ఛైర్మన్ బదులిచ్చారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
బ్రహ్మంగారిమఠంలో ఉద్రిక్తత - Kadapa Brahmangarimath News
వీరబ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రం పీఠాధిపతి ఎంపిక విషయంలో నెలకొన్న వివాద నేపథ్యంలో.... బ్రహ్మంగారిమఠంలో గ్రామస్థులు ఆందోళన చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీకాంత్‌ను అడ్డుకున్నారు.
ఛైర్మన్ శ్రీకాంత్ విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్న స్థానికులు