మహానీయుల పుట్టినరోజును కేవలం సెలవులుగా ప్రకటిస్తున్నారే తప్ప.. వారి జీవిత చరిత్ర ఎవ్వరికీ తెలియటం లేదని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జిల్లా అధ్యక్షులు శివశంకర్ అన్నారు. నేటి యువతకు మహానీయుల గురించి తెలియకపోవటం బాధాకరమని కడపలో అన్నారు.
సమాజాన్ని ప్రభావితం చేసినవారి జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. యెగి వేమన, మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి తెలియజేస్తామన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.